
నిరుపేద మహిళకు చేయూత
విద్యారణ్యపురి: కమలాపూర్ గ్రామానికి చెందిన మార్గం పావనికి హనుమకొండలోని వడ్డెపల్లిలోని విద్యా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచితంగా కుట్టుమిషన్‌తో పాటు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ల మహేందర్ మాట్లాడుతూ పావని కుటుంబం చాలా దీనావస్థలో ఉందని అన్నారు. ఆమె భర్త రెండు కాళ్లు చచ్చుబడడంతో ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆ పేద కుంటుంబానికి విద్యా ఫౌండేషన్ తరఫున చేయూతనిచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు బిట్ల అంజనీదేవి, అనంతుల ఉష, వైద్యులు వాణి, రాణి, చింతల కమల తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
ఖిలా వరంగల్: వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బండి కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం నోటుబుక్స్ పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ ఉమ హాజరై వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్‌తో కలిసి ఎంపిక చేసిన విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. న్యూడెమోక్రసీ నేత రాజేందర్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, నలిగంటి పాల్, పుప్పాల భీమయ్య, పుప్పాల రాజు, బండి శ్రీకాంత్ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు అండగా ఉంటాం
కాజీపేట రూరల్: జర్నలిస్టులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్‌లో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రెండో రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు హాజరై మాజీ కార్పొరేటర్ బోడ డిన్నాతో కలిసి ఈ నెల 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న మహాసభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని అన్నారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, ప్రేమ్, గూడూరు కరుణాకర్ పాల్గొన్నారు.
సీఐటీయూ కార్యవర్గం ఎన్నిక
హసన్‌పర్తి: సీఐటీయూ భవన నిర్మాణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దామెర చంటి, ఉపాధ్యక్షులుగా నద్దునూరి రజనీకాంత్, మేకల సురేష్, ప్రధాన కార్యదర్శిగా దామెర పవన్‌కల్యాణ్, కార్యదర్శిగా మంద చందర్, కోశాధికారిగా దామెర ప్రశాంత్, ఆర్గనైజర్లుగా పుల్లా సిద్ధార్థ్, పరికి రాజశేఖర్‌తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు సీఐటీయూ హసన్‌పర్తి మండల కార్యదర్శి పుల్లా అశోక్ వివరించారు.

నిరుపేద మహిళకు చేయూత