
స్నేహానికి అంతరాలు ఉండవు
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
హన్మకొండ: స్నేహానికి అంతరాలుండవని కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి రిజిస్ట్రార్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ మాట్లాడుతూ స్నేహం అంటేనే పరస్పర సహకారమన్నారు. కార్యక్రమంలో వెలాసిటీ కళాశాల చైర్మన్ కొండల్ రెడ్డి, డైరెక్టర్ కొండ్రెడ్డి మల్లారెడ్డి, బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు పంతంగి భాస్కర్, పొన్నం రాజు, బోనాల రమేష్, వి.మధు, తాళ్ల రవీందర్, పులి రంజిత్ గౌడ్, రాచమల్ల రాజేందర్, గోళ్ల నరేందర్, లోకుల రఘుపతి, ఎం.పద్మ, టి.రజని, నళిని ప్రియ, వెలంగిని, సోమ నరసయ్య, శ్రీధర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పులిపాక హరికృష్ణ, రాజు, కిషన్, తదితరులు పాల్గొన్నారు.