
ట్రాన్స్‌కో ఉద్యోగుల సంక్షేమానికి కృషి
హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ) –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్‌ఈఈయూ –327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో ట్రాన్స్‌కో విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సీడీబీ ఉద్యోగుల సమస్యలపై కూడా యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.రమేష్, ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, ట్రాన్స్‌కో రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం.శ్రీనివాస్, సెక్రటరీ ఆర్.శ్రీనివాస్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మారియా, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తదితరులు పాల్గొన్నారు.