
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు.
టీటీసీ పరీక్షలకు
99.11 శాతం హాజరు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివారం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్‌బజార్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్‌బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు.
శంకర్‌కు సినారె పురస్కారం
కేయూ క్యాంపస్: మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఏబీఆర్ కన్వెన్షన్ బాంక్వెట్ హాల్‌లో ఆదివారం సినారె కళాపీఠం పలువురికి సినారె సాహిత్యపురస్కారాలు ప్రదానం చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకర్‌కు పురస్కారం అందజేశారు. కళాపీఠం అధ్యక్షుడు మట్టినేని రాములు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీ
వరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై వీవీఎల్‌ఎన్ మూర్తి, హెడ్‌కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్‌ఐలు నాగయ్య, సతీశ్, ఆర్‌ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
నయీంనగర్: నగరంలోని కాళోజీ కళాక్షేత్రం, హంటర్‌రోడ్డులోని ‘కుడా’ ల్యాండ్, భద్రకాళి ఆలయ మాడవీధులు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, వరంగల్ బస్టాండ్ పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌బాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ శా ఖల అధికారుల సమన్వయంతో త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది తదితరులున్నారు.

రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ

రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ

రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ