
‘గ్రేటర్’లో జంక్షన్లు మెరవాలి
రామన్నపేట: గ్రేటర్ పరిధిలోని జంక్షన్‌లను సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి జెమిని థియేటర్, పోతన రోడ్డు జెండాప్రాంతం రామన్నపేట స్థూపం, ఉర్సు బండ వినాయక నిమజ్జనప్రాంతం, నాయుడు పెట్రోల్‌పంపు జంక్షన్, మెట్టుగుట్ట, ఫాతిమా జంక్షన్, రెడ్‌క్రాస్ సొసైటీ హనుమాన్ దేవాలయం, హనుమకొండ కలెక్టర్ నివాసం, కాళోజీ జంక్షన్, ములుగురోడ్డు జంక్షన్‌లలో బ్యూటిఫికేషన్, శానిటేషన్ పరిస్థితులను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..జెమిని థియేటర్ జంక్షన్‌ను విస్తరించి అభివృద్ధి చేయాలని, పోతననగర్ జంక్షన్ ప్రాంతంలో కల్వర్టు నిర్మించి గ్రీనరీ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఉర్సుగుట్ట ప్రాంతంలోని జంక్షన్ వద్ద పక్షుల బొమ్మలకు పెయింటింగ్స్ వేయించి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
స్పాంజ్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన..
నగరంలో స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్‌కు ఉన్నతా ధికారులు సూచించిన నేపథ్యంలో శనివారం ఆమె పోతన రోడ్డుతో పాటు బృందావన్ కాలనీలో స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇంచార్జి ఎస్‌ఈ, సిటీ ప్లానర్ మహేందర్, రవీందర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, సంతోష్‌బాబు పాల్గొన్నారు.
అధికారులకు మేయర్
గుండు సుధారాణి ఆదేశం