
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులు, సిబ్బందికి సూచించారు. హనుమకొండ టీవీ టవర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (బీ), బాలసముద్రంలోని బాలికల వసతి గృహం (ఏ)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు కోసం సిద్ధం చేసిన భోజనం, కూరలను పరిశీలించారు. రిజిస్టర్లు, బియ్యం, ఇతర వంట సామగ్రిని తనిఖీ చేశారు. . విద్యార్థుల సంఖ్య, వారి హాజరుశాతాన్ని వార్డెన్‌లను అడిగి తెలుసుకున్నారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, ఏఎస్‌డబ్ల్యూ కృష్ణ, వార్డెన్లు పాల్గొన్నారు.