
ఎన్‌జీటీ సూచనలు అమలు చేయండి
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సూచనలు అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బా జ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ము న్సి పల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌జీటీ నిబంధనల ప్రకారం వరంగల్ కోట చెరువును శుభ్రం చే యించాలని, ప్రస్తుతం ఉన్న లెగసి వ్యర్థాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలన్నారు. ఎన్‌జీటీ విధివిధానాల ప్రకారం 17 ఎకరాల భూమిని రాంపూర్ డంప్‌యార్డ్‌లో నిర్వహించడంతోపాటు బయోమైనింగ్ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ల్యాండ్‌కు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు, నియంత్రించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసేలా శిక్షణ ఇచ్చి వాటిని కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, కా లుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, బల్దియా సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలి
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో ప్రజలు, యువకులు సభ్యత్వం తీసుకొని సేవచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో రాష్ట్రపాలక మండలి సభ్యుడు శ్రీనివాస్‌రావు, డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సహకార అ ధికారి నీరజ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఐఆర్‌ఎస్ ఎంసీ మెంబర్ నాడెం శాంతికుమార్, కోశాధికారి రాజేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పంట మార్పిడిపై అవగాహన ఉండాలి
మామునూరు: పంట మార్పిడిపై రైతులు అవగా హన కలిగి ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ఏరువాక రైతుబడి కార్యక్రమంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి పర్చువల్‌గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్‌తోపాటు రైతులు వీక్షించారు. జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, ఉద్యానశాఖ అధికారి శ్రీని వాస్‌రావు, మండల స్పెషల్ అఫీసర్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, రైతులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద

ఎన్‌జీటీ సూచనలు అమలు చేయండి