
ఎన్‌సీసీతో క్రమశిక్షణ
● కమాండెంట్ కల్నల్ ఎస్‌ఎస్ రామదురై
కేయూ క్యాంపస్: ఎన్‌సీసీతో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కమాండెంట్ కల్నల్ ఎస్‌ఎస్ రామదురై అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గత నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఎన్‌సీసీ పదో తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ క్యాంపు శనివారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఇక్కడ ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 120 మందిని ఎంపిక చేశారు. అందులో డ్రిల్, బెస్ట్ క్యాడెట్స్, కల్చరల్, ఫ్లాగ్‌ఏరియా విభాగాల్లో ఎంపిక చేశారు.కార్యక్రమంలో క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవిసునారే, కెప్టెన్ డాక్టర్ పి.సతీశ్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, సుబేదారిమేజర్ జైరామ్‌సింగ్, రవీందర్, సందీప్, రాధాకృష్ణ, రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన
విద్యనభ్యసించాలి
న్యూశాయంపేట: విద్యార్థులు విలువలతో కూడిన విద్యనభ్యసించాలని, కమిషనర్ మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మైనారిటీ గురుకులాల (టెమ్రిస్) కార్యదర్శి బి.షఫియుల్లా అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖిరాలు అధిరోహించాలన్నారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్‌అక్బర్, మక్బూల్‌పాషా, అకడమిక్ కోఆర్డినేటర్ రుహీనా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిధి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు మనసు – మనిషి పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్ : వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకాలజిస్ట్, కౌన్సెలింగ్ ఎక్ప్‌పర్ట్ మెండు ఉమామహేశ్వర్ రచించిన మనసు– మనిషి వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ కిషన్‌పుర వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఉంటుందని నిర్వహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు పాల్గొనాలని కోరారు.

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

ఎన్‌సీసీతో క్రమశిక్షణ