
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
హసన్‌పర్తి: పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప ట్టాభిరామారావు హెచ్చరించారు. శనివారం హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో పోష్(లైంగిక వేధింపుల నివారక చట్టం)–2013పై అవగా హన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పని ప్రదేశంలో మ హిళలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎలా రక్షించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకో వాలనే అనే అంశాలపై వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా ఽఽధైర్యంగా ఎదరించాలన్నారు. పోష్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి మాట్లాడుతూ..మహిళలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యాయమూర్తి శ్రావణ స్వాతి, కళాశాల ప్రిన్సి పల్ రాజశ్రీరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి సత్యనారాయణ, ఏఓ వేణుగోపాల్ పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా
ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు