
పరిశ్రమలకు వేగంగా అనుమతులు
హన్మకొండ అర్బన్: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో వైవీ గణేశ్, డీఆర్‌డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డీపీవో లక్ష్మీరమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ ఎస్‌ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీటీడీవో ప్రేమలత, టీజీఐసీసీ మేనేజర్ మహేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తల్లిపాల ప్రాముఖ్యంపై
అవగాహన కల్పించాలి..
తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రజలకు, పాలసీ నిర్ణేతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డీఎంహెచ్‌వో అప్పయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, సీడీపీవోలు విశ్వజ, స్వాతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.