
మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలా
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ దర్శించుకున్నారు. గురువారం తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–2025 సందర్భంగా మామునూరు పీటీసీకి వచ్చిన ఆమె ఐనవోలు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుడు నరేశ్ శర్మ వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో అర్చకులు సన్మానించినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రకాశ్, మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ బి. రాజగోపాల్, ఎప్‌హెచ్‌ఓ శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు మధుకర్ శర్మ, వేదపారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, నరేశ్, మధు, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.