
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పథకాలు అందించడమే కాకుండా వాటిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల పర్యవేక్షణపై ఆయా ప్రాజెక్టుల అధికారులు దృష్టి సారించాలన్నారు. మహిళలు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పలు ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించి సమర్థ నిర్వహణకు సూచనలు చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఐఓ శ్రీధర్ సుమన్, సీడీపీఓలు మధురిమ, అధికారులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫర్ స్టేషన్ తనిఖీ
రామన్నపేట : హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డులో ఉన్న ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో చెత్త తరలింపు తీరును గురువారం మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలింపు జరిగే విధానాన్ని అధికారులను అడిగి తెలుసున్నారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, నరేందర్, ఇన్‌స్పెక్టర్లు బాషా నాయక్, సురేశ్, శ్రీనివాస్ ఉన్నారు.