గాయత్రీదేవిగా భ్రమరాంబకు అలంకారం | - | Sakshi
Sakshi News home page

గాయత్రీదేవిగా భ్రమరాంబకు అలంకారం

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

పెదకాకాని: పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబదేవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు పాత్రఃకాల అర్చన, అభిషేకం, పంచహారతులు, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవావరణార్చనలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణ జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. యాగశాలలో జరిగిన రుద్ర, చండీ హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్థ్ధప్రసాదాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌, పాలక మండలి చైర్మన్‌ కోసూరి పూర్ణ చంద్రరావు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాయంత్రం 5.30 గంటల నుంచి పెదకాకాని ఆలూరి సుజాత బృందం భజన కార్యక్రమం, విజయవాడ నటరాజ నృత్య కళా నిలయం వారిచే కూచిపూడి నృత్యం, మంగళగిరి శ్రీవెంకటరామ సంగీత నృత్యశాల వారిచే కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. గుంటూరుకు చెందిన నలకా శ్రీనివాసరావు పర్యవేక్షణలో శ్రీ కృష్ణరాయభారం నాటకం నుంచి పడక సీను, ఆర్గనైజర్‌ వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి కాటి సీను ప్రదర్శించారు. బుధవారం అమ్మవారు అన్నపూర్ణ్ణాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారని డీసీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement