ఎరువుల సరఫరాలో సమస్యలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువుల సరఫరాలో సమస్యలు నివారించాలి

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

ఎరువుల సరఫరాలో సమస్యలు నివారించాలి

గుంటూరు వెస్ట్‌: ఎరువుల సరఫరాలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక రంగాలపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌ సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ యూరియా, ఎరువుల సరఫరా, డిమాండ్‌ అంచనాలు వేయాలన్నారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా లోపం రాకుండా ఎయిమ్స్‌ యాప్‌ ద్వారా పంపిణీ జరగాలన్నారు. రైతుల ఈకేవైిసీ త్వరగా చేయించాలన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగు పరచుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడంలో అశ్రద్ధ ఉండకూడదని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం దిశగా ఎక్కువ మంది రైతులు పయనించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి మాట్లాడుతూ ఈ – పంట 97 శాతం పూర్తి అయిందన్నారు. లక్ష్యం మేరకు పూర్తి చేస్తామని చెప్పారు. సిబ్బంది కరువు లెక్కల సేకరణలో కొంత మేర నిమగ్నం కావడం వలన స్వల్ప జాప్యం జరిగిందన్నారు. సీసీఆర్‌సీ బీమా వందశాతం చేశామన్నారు. మూడు డ్రోన్‌లు ఎస్సీ లబ్ధిదారులకు రావలసి ఉందన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ టి.నరసింహారెడ్డి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం రాజకుమారి, ఎ.ిపి.ఎం.ఐ.పి. పీడీ ఎల్‌. వజ్రశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు కె.వి.వి.సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement