బీసీలంటే అంత అలుసా! | - | Sakshi
Sakshi News home page

బీసీలంటే అంత అలుసా!

Oct 10 2026 1:58 AM | Updated on Oct 10 2026 1:58 AM

బీసీలంటే అంత అలుసా! బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంటూ బాబు డ్రామా పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంటూ బాబు డ్రామా

● అధికారంలోకి వచ్చాక జిల్లాలో

బీసీలకు 3 శాతం కూడా

పదవులు ఇవ్వని వైనం

● జిల్లాలో బీసీలకు ఒక్క నామినేటెడ్‌

పోస్ట్‌ కూడా ఇవ్వని కూటమి సర్కార్‌

● కోర్టులు కొట్టేస్తాయని

తెలిసీ బీసీలను వంచించే యత్నం

● జిల్లాలో బీసీలకు అత్యున్నత పదవులు

ఇచ్చి గౌరవించిన వైఎస్‌ జగన్‌

● కూటమి ప్రభుత్వంలో సొంత

సామాజిక వర్గం నేతలకే పదవులు

సాక్షిప్రతినిధి, గుంటూరు: రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 50కిపైగా నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారు. అందులో 34 శాతం మాట అటుంచితే.. కనీసం మూడు శాతం పదవులు కూడా బీసీలకు కేటాయించలేదంటే వీరికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారిని రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశం ఏ కోశానా కూటమి ప్రభుత్వానికి లేదనే విషయం రెండున్నరేళ్ల పాలనలో స్పష్టంగా అర్థమైంది. జిల్లా టీడీపీలో బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీ వారు పైకి రాలేని దుర్భర పరిస్థితి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన ఉన్నత స్థాయి పదవులన్నీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డ్రామాలు అడుతున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఇచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారిక పదవుల్లో కనీసం ఒక్క శాతం కూడా బీసీలకు ఇవ్వలేదంటే వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. బీసీలకు హామీలు మాత్రం ఫుల్‌గా ఇచ్చిన చంద్రబాబు పదవులు మాత్రం నిల్‌ అన్నట్లుగా వ్యవహరించారు. దీనిపై సొంత పార్టీలోని బీసీలే రగిలిపోతున్నారు. దీని వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో 34 శాతం రిజర్వేషన్‌ల పేరుతో కపట ప్రేమ ఒలకబోస్తున్నారనే బీసీ సంఘం నేతలు మండిపడుతున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకనే ప్రభుత్వం వచ్చాక జిల్లా నుంచి ఇచ్చిన రెండు రాజ్యసభ సీట్లు సొంత సామాజిక వర్గం వారికే కేటాయించారు. ఎమ్మెల్సీ స్థానం సైతం వారికే ఇచ్చుకున్నారు. బీసీలు అప్పుడు కనిపించలేదా అంటూ వారు నిలదీస్తున్నారు. తాజాగా గుంటూరు మేయర్‌ స్థానం సైతం బీసీలకు దక్కకుండా తిరిగి ఓసీకే రిజర్వు అయ్యేలా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు వంటి కింది స్థాయి పదవులు బీసీలకు కట్టబెట్టి తాము అధికార ప్రాధాన్యం ఇచ్చామనే కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం తప్ప, చిత్తశుద్ధితో ఉన్నత స్థాయి పదవుల్లో బీసీలను కూర్చొబెట్టే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదనే విమర్శలు బీసీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన జంగా కృష్ణమూర్తికి టీటీడీ మెంబర్‌ పదవి మినహా జిల్లాలో ఇచ్చిన 50కు పైగా రాష్ట్ర ఉన్నతస్థాయి నామినేటెడ్‌ పోస్టుల్లో ఒక్క పదవి కూడా బీసీలకు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని ఆ పార్టీ బీసీ నేతలే లోలోపల రగిలిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement