స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పోస్టులు, చట్టసభల్లోనూ జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమైన వాటా దక్కాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కూటమి ప్రభుత్వంలో బీసీలకు నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కడం లేదు. బీసీల హక్కులు ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి లేవు. బీసీల జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లోనూ న్యాయమైన వాటా లభించే వరకు పోరాటం సాగిస్తాం.
– కేసన శంకరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం


