బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నిర్దిష్ట విధివిధానాలు, శాసీ్త్రయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని ఏడాది క్రితమే ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్యతో కలిసి ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశాం. సరైన విధానం పాటించకుండా ప్రభుత్వం జారీ చేసే జీవోలు కోర్టుల్లో నిలబడవని, దీనిపై మేం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం. ఆ పిటిషనుపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు.
– డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు,
రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్


