గుంటూరు వెస్ట్: జిల్లాలో పల్లె పండగ పనులను రూ.45.32 కోట్లతో మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 575 పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో 217 సిమెంట్ రోడ్లు, 10 గ్రావెల్ రోడ్లు, మూడు బీటీ రోడ్లు, 345 పశువుల శాలలు ఉన్నాయని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పల్లె పండుగ పనులు చేపడతామని తెలిపారు.


