డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్
డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాల్లో డిసెంబరు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సివిల్ కేసులు, రాజీ పడ దగిన క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇచ్చిన సర్కులర్ ప్రకారం కొన్ని రాజీ పడదగిన కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్‌ఏఓపీ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు, పోలీస్ అధికారులు, స్టేక్ హోల్డర్లు ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలన్నారు.
ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి
కార్మిక శాఖ నోటీసులు
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి శుక్రవారం కార్మిక శాఖ అధికారులు నోటీసులు అందజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా లేబర్ సెస్ రూ. 5.13 కోట్లు పెండింగ్‌లో ఉందని, వసూలు చేయాలని ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. 2016 నుంచి రూ. 580 కోట్ల ఎస్టిమేషన్‌తో భవనాలు నిర్మిస్తోందని, దీనికి గాను లేబర్ సెస్ 5.80 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం రూ. 71.72 లక్షలు మాత్రమే చెల్లించారని, మిగిలినది కూడా చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 24న విచారణకు రావాలంటూ వర్సిటీ వైస్ చాన్సలర్‌కు నోటీసులు అందించారు.