ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా నిర్వహించాలి

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీంబాషా

చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement