వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం ● ఆ సైబర్‌ నేరస్తుడు మళ్లీ ఫోన్‌ చేసి రూ. 7150 చెల్లించండి, అప్పుడే మీకు నటరాజ్‌ పెన్సిల్‌ లోడ్‌ వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చిన కొండా అంకమ్మ సదరు వ్యక్తితో ఫోన్‌లో గట్టిగా మాట్లాడింది. వెంటనే సదరు ఆ వ్యక్తి మీరు రూ.7150 రిటర్న్‌ ఛార్జీలు చెల్లించకపోతే 10 నిమిషాల్లో మీపై పోలీసు ఫిర్యాదు నమోదవుతుందని, మీ పత్రాలను పరిశీలిస్తారు మరియు మీ కెరీర్‌పై ప్రభావం పడుతుందని, మీరు ఎక్కడా ఉద్యోగం పొందలేరని, మీకు మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ. 52,500లు జరిమానా కూడా విధిస్తామని మెసేజ్‌ పెట్టాడు. వెంటనే మళ్లీ ఫోన్‌ చేసి డబ్బులు చెల్లించకపోతే నీ ఫొటోలు, ఆధార్‌ కార్డు మా దగ్గర ఉన్నాయి, నిన్ను క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పట్టకుంటారు. ఇప్పుడే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులతో మాట్లాడు.. అంటూ ఫోన్‌ కలిపాడు.. ● వెంటనే సదరు మహిళ ఫోన్‌ నెంబర్‌కు వాట్సప్‌ ద్వారా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ ఒక ఐడీ కార్డు పెట్టారు. ఆ ఐడీ కార్డులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అని ఉంది. కార్డు చూసిన వెంటనే సదరు వ్యక్తి పోలీస్‌ డ్రెస్‌లో అవతల నుంచి ఫోన్‌ చేసి మీ ఇంటికి వస్తున్నాం. నిన్ను అరెస్ట్‌ చేస్తాం.. అంటూ బెదిరించాడు. బాధిత మహిళకు ఏం చేయాలో అర్ధం కాక తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఫోన్‌పే ద్వారా కొంత నగదు బదిలీ నగదు లేవని చెప్పడంతో బెదిరింపులు క్రైమ్‌ బ్రాంచ్‌ పేరుతో వీడియో కాల్‌ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ

తాడేపల్లి రూరల్‌: వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరిట మహిళను మోసం చేయడమే కాకుండా.. క్రైం బ్రాంచ్‌ పోలీసులమంటూ.. సీబీఐ అంటూ బెదిరించిన ఘటనపై కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణ పరిధిలోని కొండా అంకమ్మ గృహిణి. ఆమెతో పాటు అత్త, మామలు కూడా ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవారం మధ్యాహ్నం 9846719089 నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. అవతలి వ్యక్తి మీకు నటరాజ్‌ పెన్సిల్‌ కంపెనీ నుంచి మంచి ఆఫర్‌ వచ్చిందని, ముందుగా మీరు సభ్యత్వం తీసుకోవాలని, అందుకు రూ.650 చెల్లిస్తే వివరాలు తెలుపుతామని చెప్పడంతో గృహిణి అయిన కొండా అంకమ్మ రూ. 650లు ఫోన్‌పే ద్వారా చెల్లించింది. వెంటనే మళ్లీ సదరు వ్యక్తి ఆ మహిళకు ఫోన్‌ చేసి మీరు నటరాజ్‌ పెన్సిల్‌ స్కీమ్‌లో సెలెక్ట్‌ అయ్యారని, రూ.1,999లు చెల్లించాలని చెప్పడంతో కొండా అంకమ్మ ఒక్క రూపాయి ఏముందంటూ రూ.2వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించింది. రెండు వేల రూపాయలు చెల్లిస్తే స్కీమ్‌కు అనర్హులని, రూ. 1999లు మాత్రమే చెల్లించాలని చెప్పడంతో మళ్లీ వారు చెప్పిన డబ్బులను ఫోన్‌పే ద్వారా చెల్లించింది. మీ ఇంటికి సాయంత్రం కల్లా ట్రక్‌తో పెన్సిల్‌ లోడ్‌ వస్తుందని, ఛార్జీల నిమిత్తం రూ. 3599లు చెల్లించమనడంతో ఆ నగదు సైతం చెల్లించింది. వెంటనే ఆ వ్యక్తి మీ ఫొటో పెట్టమని చెప్పడంతో సదరు మహిళ తన ఫొటోను పంపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement