
8వ రౌండ్‌కు చేరిన జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ఆసక్తికరంగా జరిగాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్‌పీబీకి చెందిన నాలుగు సార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం దీప్‌సెం గుప్తాపై గెలిచాడు. అదే జట్టుకు చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ గుప్తా యూపీకి చెందిన ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిపై విజయం సాధించారు. దీంతో శశికిరణ్, అభిజీత్‌లు చెరో ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచారు. వీరికి సగం పాయింట్ వెనుక ఆరుగురు ఆటగాళ్లు (తమిళనాడు జీఎం ఇనియన్, రైల్వేస్ జీఎం దీపన్ చక్రవర్తి, నలుగురు ఐఎంలు) ఉన్నారు.
తెనాలి: శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన సోమవారం సాయంత్రం తెనాలిలో 108 వీణల ఘన సప్తస్వర సమ్మేళనం (వీణా సింఫనీ) నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) ఆధ్వర్యంలో 108 మంది వైణికుల వాద్య స్వర తరంగాలు ఒకే సమయాన ఆడిటోరియంలో ఆవహించాయి. దివ్యానంద సుడిగాలిలా భక్తులను చుట్టుముట్టాయి. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఈ ఆధ్యాత్మిక సంగీత యజ్ఞాన్ని వేడుకగా చేశారు. బాలస్వామీజీ స్వయంగా వీణావాదన చేశారు. సరస్వతీ దేవికి ప్రీతిపాత్రం వీణ అని తెలిసిందే. వీణ ధ్వనిని వేదమంత్రాల నాదంతో సమానంగా పరిగణిస్తారు. ఇక 108 సంఖ్య హిందూ సంప్రదాయంలో పవిత్రమైనది. జపమాలలో ఉండే గింజల సంఖ్య 108. అంతమంది వైణికులు ఒకేసారి వీణ వాయించటమంటే జపమాల గింజల్లా ప్రతి స్వరం ఒక మంత్రధ్వనిగా మారటం అన్నమాట! శ్రోతలలో భక్తి, శాంతి, ఆనందం, ఆత్మశుద్ధిని కలిగించే ఆధ్యాత్మిక యజ్ఞంలా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ విద్యా పీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా సంస్థల బాధ్యులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్‌గా (డీడీ) బండి పాల్ సుధాకర్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి ద్వారా డీడీగా విధుల్లో చేరనున్నారు. కడపకు చెందిన పాల్ సుధాకర్ హాకీ క్రీడలో ప్రతిభ చాటారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్పోర్ట్స్ కోటాలో 1993లో సీనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆఫీస్ సూపరింటెండెంట్‌గా, పరిపాలనా అధికారిగా పదోన్నతులు పొంది 2014 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొంది గుంటూరు జీజీహెచ్‌కు 2015లో బదిలీ అయ్యారు. అక్కడి నుంచి గుంటూరు వైద్య కళాశాలకు 2019లో బదిలీ అయ్యారు. నేడు పదోన్నతి పొంది గుంటూరు ఆర్డీ కార్యాలయం డీడీగా విధుల్లో చేరనున్నారు.
యర్రబాలెం(మంగళగిరి): ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన యర్రబాలెం బీసీ కాలనీలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని యర్రబాలెం బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలిక అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యలో బాలికను వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

8వ రౌండ్‌కు చేరిన జాతీయ చెస్ పోటీలు

8వ రౌండ్‌కు చేరిన జాతీయ చెస్ పోటీలు