
నూతన ఉపాధ్యాయులకు అభినందన
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆఫ్ లైన్‌లో 117 మందికి, ఆన్‌లైన్‌లో 217 మందికి డీఎస్సీ కోచింగ్ అందించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 14 మంది, స్కూల్ అసిస్టెంట్‌గా నలుగురు ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయటంతోపాటు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి పాల్గొన్నారు.
శ్రీరాముడిని తాకిన
సూర్యకిరణాలు
బల్లికురవ: దసరా శరన్నవరాత్రులు, మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం మండలంలోని కొత్తపాలెం రామాలయాన్ని సూర్యకిరణాలు తాకాయి. దక్షిణాయన పుణ్యకాలంలో పర్వదినాన సూర్యకిరణాలు శ్రీరామ చంద్రస్వామిపై పడటం ఎంతో శుభపరిణామని ఆలయ అర్చకులు ఐనవోలు సుబ్బాచార్యులు శివసాయి అన్నారు. పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హరిద్రా చూర్ణ లేపనం అష్టోత్తర శతనామ పూజ, ప్రత్యేక అలంకరణ, దివ్యమంగళ హారతి చేపట్టారు. ఆ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
సచివాలయ
ఉద్యోగుల నిరసన
బాపట్ల: సచివాలయం ఉద్యోగస్తులు ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద, మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయంలో వలంటీర్లను తొలగించి వారు చేసే ప్రతి పనిని ఉద్యోగులతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై సర్వేల భారం పెట్టి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రూ ప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
●సికింద్రాబాద్ – అనకాపల్లి (07059) ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి ఏడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07060) 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు చర్లపల్లి, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ, కై కలూరు, అకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది.

నూతన ఉపాధ్యాయులకు అభినందన

నూతన ఉపాధ్యాయులకు అభినందన