న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ముంపు పొలాలు పరిశీలన
కొల్లిపర: మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యానవన అధికారి బి.రవీంద్రబాబు సోమవారం పరిశీలించారు.
ఎస్పీని కలసిన పీఎస్‌ఐలు
నగరంపాలెం: జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో శిక్షణ పొందుతున్న పీఎస్‌ఐలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
చండీ హోమం
నగరంపాలెం: బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం చండీహోమం నిర్వహించారు.
మంగళగిరిలోని జీఆర్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన మందిరంలో
చిన్నారులు, మహిళల పూజలు
గుంటూరు నగరంలోని కొరిటెపాడు
సెంటర్‌లో సరస్వతీదేవి అలంకారం
పెదకాకాని శివాలయంలో సరస్వతీ దేవిగా భ్రమరాంబ అమ్మవారు
మంగళగిరి నృసింహస్వామి ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. చదువుల తల్లిగా..జ్ఞాన ప్రదాయినిగా పలు ఆలయాల్లో అమ్మవారు సోమవారం సరస్వతీ దేవిగా
దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా పలు పాఠశాలల్లో సరస్వతి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామ రూపిణీ ! అంటూ ప్రార్థించారు. చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇవ్వాలని కోరారు. ప్రసిద్ధ పెదకాకాని శివాలయంలో భ్రమరాంబ అమ్మవారు వీణాధరిగా పూజలందుకున్నారు. విద్యార్థులు, మహిళలు దర్శించుకుని సకల జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు. మంగళగిరిలోని నృసింహ ఆలయంలో అమ్మవారు సరస్వతి మాతగా శోభాయమానంగా దర్శనమిచ్చారు. –మంగళగిరి / నగరంపాలెం/ పెదకాకాని
సరస్వతీ
నమస్తుభ్యం !
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు