
మున్సిపల్ చైర్మన్‌గా మదార్ సాహెబ్ బాధ్యతల స్వీకరణ
మాచర్ల: పట్టణానికి నూతనంగా పురపాలక సంఘ చైర్మన్‌గా షేక్ మదార్ సాహెబ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11గంటలకు మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల కిందట వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మదార్ సాహెబ్‌ను చైర్మన్‌గా కౌన్సిల్ నిర్ణయించింది. అంతకుముందు ఇన్‌చార్జి మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించిన పోలూరి నరసింహరావు పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా మదార్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ తన చిరకాల వాంఛ అయిన మున్సిపల్ చైర్మన్ పదవి స్వీకరించటానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలూరి నరసింహారావు, టీడీపీ నియోజక వర్గ నాయకులు యెనుముల కేశవరెడ్డి, పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మద్దిగపు వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి సత్కరించారు.