పౌర రక్షణ.. సమర శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పౌర రక్షణ.. సమర శిక్షణ

May 8 2025 8:01 AM | Updated on May 8 2025 11:14 AM

పౌర ర

పౌర రక్షణ.. సమర శిక్షణ

లక్ష్మీపురం: అత్యవసర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో పౌరులు పాటించాల్సిన స్వీయ రక్షణ జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. డానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌ ఎ.రమణమూర్తి, అదనపు ఎస్పీ (ఏఆర్‌) ఏ. హనుమంతు పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ యుద్ధ సమయాల్లో అప్రమత్తతతో అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. విపత్కర సమయాల్లో అత్యవసర సేవలకు సంబంధించి ఆయా శాఖల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారనే సందేశాన్ని కూడా ఈ పౌర రక్షణ మాక్‌ డ్రిల్‌ ద్వారా ఇచ్చినట్లు తెలిపారు.అదనపు ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రమాద హెచ్చరిక సైరన్‌ బట్టి ప్రత్యేక బలగాలు, సిబ్బంది సామాన్య పౌరుల మాదిరి స్వీయ రక్షణ కోసం అకస్మాత్తుగా కింద పడుకోవాలని సూచించారు. పెద్ద శబ్దాలను తట్టుకోవడానికి రెండు చేతులతో చెవులను మూసుకునీ, అటుఇటు కదలకుండా బోర్లా పడుకోవాలని సూచించారు. ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బంది అంబులెన్స్‌లోకి తీసుకువెళ్లడం గురించి వివరించారు. బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు, దొరికిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెస్ట్‌ డీఎస్పీ అరవింద్‌ , రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, ఈస్ట్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ , పోలీస్‌ బలగాల సిబ్బంది, పౌరులు ల్గొన్నారు.

జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

గుంటూరు రైల్వే స్టేషన్‌లో

పోలీసుల మాక్‌ డ్రిల్‌

పౌర రక్షణ.. సమర శిక్షణ
1
1/1

పౌర రక్షణ.. సమర శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement