
వైభవంగా శ్రీభారతి మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక అరండల్‌పేట 4/2వ అడ్డరోడ్డులో కొలువైన శ్రీశృంగేరి శ్రీవిరుపాక్ష శ్రీపీఠంలో నిర్వహిస్తోన్న శ్రీ భారతి మహోత్సవాలు నాలుగో రోజుకి చేరాయి. శ్రీమహా కామేశ్వరి ధర్మ పరిపాలనా సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, ఆదివారం నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పీఠాధిష్ఠాత్రి శ్రీ రాజ రాజేశ్వరి ప్రతాప భారతి పరదేవత అనుగ్రహంతో పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ గంభీరానంద భారతిస్వామిచే శ్రీశృంగేరి శ్రీవిరూపాక్ష శ్రీ పీఠానికి శ్రీపరశివానంద భారతిస్వామికి ఉత్తర పీఠాధిపతిగా పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శిష్యులకు తీర్థ ప్రసాద వినియోగం, అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. గంభీరానంద భారతి మహాస్వాములు అనుగ్రహ భాషణం చేఽశారు. సోమవారం కళ్యాణానంద భారతి మాంతాచార్య మహాస్వామి వారి జయంతి నిర్వహించనున్నారు. కార్యక్రమంలో హిందూ కళాశాల అధ్యక్షులు ఎఎస్‌వీఎస్ సోమయాజి, ఆడిటర్లు జి.శివరామకష్ణప్రసాద్, పరమహంస, హైకోర్టు న్యాయవాది కృష్ణప్రసాద్, నగర వైదిక ప్రముఖులు పాల్గొన్నారు.