ఆధారాలు చూపిస్తే ధర్మకర్తగా తప్పుకుంటా..
మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామోహన్‌రావు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వక్ఫ్ బోర్డు అధికారులు అన్ని ఆధారాలూ చూపిస్తే ధర్మకర్తగా తప్పుకునేందుకు అభ్యంతరం లేదని హజ్రత్ మస్తాన్ షా వలి దర్గా ధర్మ కర్త రావి రామోహన్‌రావు (దర్గా రాము) అన్నారు. స్ధానిక నగరంపాలెంలోని హజ్రత్ కాలేషా మస్తాన్ వలి దర్గా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మస్తానయ్య దర్గాను తమకు అప్పగించాలని వక్ఫ్ బోర్డు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని 1892లోనే మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు మస్తానయ్య దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వక్ఫ్ బోర్టు సభ్యులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దర్గా వక్ఫ్ పరిధిలో ఉన్నట్లుగా తమకు ఆధారాలు చూపిస్తే ధర్మకర్తగా తప్పుకొని వారికి అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అనంతరం ఽరావి రామోహన్‌రావు సతీమణి విలేకరులతో మాట్లాడారు.


