‘హ్యాకింగ్‌’ చిత్రం పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘హ్యాకింగ్‌’ చిత్రం పోస్టర్‌ ఆవిష్కరణ

Apr 11 2025 1:40 AM | Updated on Apr 11 2025 1:40 AM

‘హ్యాకింగ్‌’ చిత్రం పోస్టర్‌ ఆవిష్కరణ

‘హ్యాకింగ్‌’ చిత్రం పోస్టర్‌ ఆవిష్కరణ

నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్‌ మోసాలపై విసృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం హ్యాకింగ్‌ సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. హ్యాకర్ల సైబర్‌ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకులు నరేష్‌ దోనె, మణివరన్‌ తెలిపారు. ఇటీవల వచ్చిన ఏఐతో ఫొటో ద్వారా కూడా సరికొత్త సైబర్‌ నేరాలను హ్యాకర్లు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు వీటి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలను చిత్రం ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. అంజలి సమర్పణలో అనుపమ ఆర్ట్స్‌ పతాకంపై రావూరి సురే ష్‌బాబు చిత్రం నిర్మిస్తున్నారని చెప్పారు. కొన్ని సన్నివేశాలను కొండవీడులో చిత్రీకరించామని, నటిగా ముంబైకు చెందిన కావ్య దేశాయ్‌ నటిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement