● ఏపీ ఈగల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్, ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకె రవికృష్ణ ● చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
గుంటూరు రూరల్: మాదకద్రవ్యాలు మానవాళికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్, ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకె రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మత్తు, మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి స్కూల్, కాలేజీలలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేయాలని సూచించారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఎస్పీ కె.నగేష్‌బాబు, చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, కరస్పాండెంట్ వై. సుజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కళాశాల యాజమాన్యం అతిథులను సన్మానించింది.