
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 46, 47వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఈనెల 11న యూనివర్సిటీలో జరగనున్నాయి. డైక్‌మెన్ ఆడిటోరియం వేదికగా రెండేళ్ల తరువాత ఈ వేడుకలు జరుగుతుండటంతో యూనివర్సిటీ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్వహణ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
పలువురికి ప్రతిభా పురస్కారాలు
సమాజంలోని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన 22 మంది ప్రతిభావంతులకు యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జయప్రద రామమూర్తి(శాసీ్త్రయ సంగీతం), ఎం.గిరజా శంకర్, (ఐఏఎస్ అధికారి), గద్దె మంగయ్య (విద్య, దాతృత్వ), దాసరి రామకృష్ణ(సైన్స్ అండ్ టెక్నాలజీ), డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి(వైద్యం), డాక్టర్ మాకినేని కిరణ్ (వైద్యం), ఎన్.హనుమంతరావు(కళారంగం), మాస్టార్‌జీ (సామాజిక కళా సేవా రంగం), డాక్టర్ కోయి కోటేశ్వరరావు (సాహిత్య రంగం), ఆశిరయ్య (జానపద కళారంగం), సిస్టర్ రోసలీన( సేవా రంగం) ప్రతిభా పురస్కారాలు అందుకోనున్నారు. 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎం.వేణుగోపాలరెడ్డి (గుంటూరు కలెక్టర్), మల్లాది సూరిబాబు (శాసీ్త్రయ సంగీత రంగం), ఆర్.గోపాలకృష్ణ( విద్యా రంగం), డాక్టర్ గీతా రెడ్డి ( మహిళా సాధికారిత), శారదా శృంగేరి (లిటరేచర్ అండ్ సేవా రంగం), డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ(పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగం), ఆచార్య వడ్లమూడి విజేత (ప్రత్యేక ప్రతిభా రంగం), డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ(ప్రజా వైద్య రంగం), జయరాజు(జానపద సంగీతం), సయ్యద్ మౌలాలి(గ్రామీణ పారిశ్రామిక రంగం), దర్శనం మొగలయ్య (కళారంగం) ప్రతిభా పురస్కారాలు అందుకోనున్నారు. వీరితోపాటు యూనివర్సిటీ కళాశాలల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ జర్నల్స్ ప్రచురించిన అధ్యాపకులకు బెస్ట్ రీసెర్చర్ అవార్డు, బెస్ట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ పేటెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విశిష్ట అతిథిగా ఏఎన్‌యూ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్ దాస్ హాజరుకానున్నారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సభకు అధ్యక్షత వహిస్తారు. రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొంటారు. వ్యవస్థాపక దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రతిష్టాత్మకంగా వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని వీసీ రాజశేఖర్, వ్యవస్థాపక దినోత్సవ కన్వీనర్ ఆచార్య కె.మధుబాబు తెలిపారు.
పలు రంగాల ప్రతిభావంతులకు పురస్కారాలు ప్రదానం ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి