
సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపులు, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం పునరుద్ధరిస్తూ.. ఎక్సైజ్ శాఖ జీవో 376 జారీ చేసింది. ప్రతి మద్యం షాపు, బార్‌లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. నకిలీ మద్యానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏడాది కిందట క్యూ ఆర్ కోడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. టీడీపీ నేతల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్లగానే క్యూ ఆర్ కోడ్ విధానం ఎత్తివేసింది.
ఏడాదిగా మద్యం, బార్ షాపుల్లో నకిలీ మద్యానికి ఎక్సైజ్ శాఖ ఆస్కారం కల్పించింది. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడటంతో తాజాగా జీవో జారీ చేస్తూ.. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ తెచ్చింది. మద్యం షాపు, బార్లలో ప్రతి బాటిల్‌ను క్యూ ఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాలని ఆదేశాల జారీ చేసింది.