మూడింటి కలయికతో మున్ముందుకు

Raj Kiran Rao Article On Union Bank Of India - Sakshi

సందర్భం

ఏప్రిల్‌ 1, 2020 నుంచి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోదర బ్యాంకులైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకులను కలుపుకొని భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో ఒక నూతన చరి త్రకు శ్రీకారం చుట్టింది. దీంతో సుమారు 12 కోట్ల మంది ఖాతాదారులు, 9,500 శాఖలు, 75 వేలకు పైగా ఉద్యోగులతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదవ స్థానంలో నిలిచింది.కొంతమంది నిరాశావాదులు ఈ కొత్త ఆవి ర్భావం విజయవంతం కాదని వాదించారు. కోవిడ్‌  కాలంలోనూ అబ్బురపరిచే విధంగా మొదటి త్రైమాసికంలోనే 333 కోట్ల రూపాయల లాభాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆర్జించింది. వ్యాపారంలో 5 శాతం వృద్ధిని నమోదు చేసుకొని, తన వ్యాపార మొత్తాన్ని రూ.15,42,668 కోట్లకు పెంచుకొంది.

మొండి బకాయిలను, నిరర్థక ఆస్తుల శాతాన్ని గణనీయంగా తగ్గించుకొంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులకు అత్యధిక శాఖలు ఉన్నాయి. ఈ మూడు బ్యాంకుల మేలుకలయికతో శాఖల సంఖ్యాపరంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో 17 శాతం దక్కించుకుంది, తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం దక్కించుకుంది. డిపాజిట్ల పరంగా ఆంధ్ర రాష్ట్రంలో 19 శాతం, తెలంగాణలో 13 శాతం దక్కించుకుని అగ్రగామి బ్యాంకుల సరసన నిలిచింది.రైతులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఉద్యోగులు– ఇలా సమాజంలో అనేక వర్గాలను ఆకట్టుకునే విధంగా మా పథకాలు ఉన్నాయి. వృద్ధులకు ఆసరా చెల్లింపులు చేస్తున్నాం.

అన్ని సేవలు డిజిటల్‌ మాధ్యమాల ద్వారా అందజేయడానికి కృషి చేస్తున్నాం. కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న జీవన వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని వారి చెల్లింపు వాయిదాలను, రేట్లను నిర్ధారించడం జరిగింది.ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకులకు హైదరాబాద్, మంగళూరు నగరాలలో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. గతంలో ఈ నగరాలు ఆంధ్ర, కార్పొరేషన్‌ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కావడంచేత వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే కొన్ని కీలకమైన కార్యాలయాలను ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఈ చర్య నైసర్గిక, మానవ వనరుల సద్వినియోగంలో ఒక సమతుల్యతను సాధిస్తుంది.

మా ఉద్యోగులు ఈ విపత్తు సమయంలోనూ తమ విధులు నిర్వర్తించి స్ఫూర్తిదాయకంగా నిలి చారు. ఈ కాలంలోనే 125 స్థానిక ప్రధాన కార్యాలయాలు, 18 ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి కార్యాలయాలు ప్రారంభించగలిగాం. ముంబైలో యూని యన్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయాల ప్రారంభోత్సవానికి గాంధీజీ విచ్చేసి తమ ఆశీస్సులు అందజేశారు. అలాగే గాంధీజీ శిష్యులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్‌ను, హాజీ ఖాన్‌ బహదూర్‌ అబ్దుల్లా కార్పొరేషన్‌ బ్యాంకును స్థాపిం చారు. ఈ మహనీయుల వారసత్వాన్ని మేము కాపాడుతాం. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు మా సేవల విషయంలో నమ్మకం కలిగించడం మా గురుతర బాధ్యత. ఈ మూడు బ్యాంకుల కలయిక గాంధీజీ సిద్ధాంతమైన వినియో గదారుడే దేవుడు అనేదానికి ప్రతిరూపంలా కొనసాగుతుంది.

ముందు ముందు బ్యాంకింగ్‌ రంగంలో ఆశావహ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యతరహా, సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న వారి రుణాలను తిరిగి బేరీజు వేసేం దుకు కూడా ఆర్బీఐ అంగీకరించింది. లాక్‌డౌన్‌తో నష్టాల్లో ఉన్న అనేక మందికి ఇది ఉపశమనం కలగజేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భరత ప్యాకేజీ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుంది. దీనివల్ల కష్టకాలంలో స్తబ్దంగా ఉన్న పరిశ్రమలు, ఇతర వర్గాలు పుంజుకుంటాయి. ఇవి దేశ సౌభాగ్యానికి దోహదం చేయగలవు. మేము ఈ మూడు బ్యాంకుల శుభ కలయికతో బ్యాంకింగ్‌ రంగంలో సరైన ముందడుగు వేశాం.

రాజ్‌ కిరణ్‌ రాయ్‌
వ్యాసకర్త ఎండీ, సీఈఓ, యూనియన్‌ బ్యాంక్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top