ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమే’ రాణి

Andhra Pradesh Govt Higher Importance To Women Welfare - Sakshi

సందర్భం

స్త్రీలు ఎక్కడైతే గౌరవింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీలను గౌరవించే చోట విజయం సిద్ధిస్తుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వం లోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం దీనిని అక్షరాలా అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో మహిళాసాధికారత, మహిళాభ్యు న్నతి, మహిళల రక్షణ అనేవి వారి అవసరం వచ్చి నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చేవి. నిజం చెప్పా లంటే వారి శ్రేయస్సు కోసం పాటుపడింది మాత్రం శూన్యం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు సమీ పిస్తున్న వేళ మహిళలను మభ్యపెట్టడానికి అప్పటి కప్పుడు కొన్ని పథకాలు ప్రకటించినా, అవి కేవలం ఎన్నికల స్టంటేనని రాష్ట్ర మహిళలు గ్రహించారు. అందుకే జగనన్నను తమ తోబుట్టువుగా ఆదరించి, ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడ ఆగి తన ఉపన్యాసాన్ని ప్రారంభించినా, తొలుత ‘నా అక్క చెల్లెమ్మలు’ అని ఎంతో ప్రేమతో సంబోధించేవారు. ఎన్నికల తద నంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవి స్వీక రించిన తర్వాత ఒక గిరిజన మహిళకు ఉప ముఖ్య మంత్రి పదవి కేటాయించడం, మంత్రి వర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం శాఖను దళిత మహిళకు కట్టబెట్టడం గమనిస్తే మహిళల పట్ల ఆయనకు ఎంతటి గొప్ప ఆదరణ, గౌరవం ఉందో తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి నాయకుడు వైఎస్‌ జగన్‌. మహిళల కోసం కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల పరి షత్‌ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా మహిళ లకు విస్తారంగా అవకాశాలు లభించనుండటం వల్ల స్థానిక సమస్యలు సమర్థవంతంగా పరిష్క రించుకోవచ్చు. సర్పంచులుగా మహిళలు చిత్త శుద్ధితో పనిచేసి గ్రామ పరిధిలో అభివృద్ధికి బాటలు వేసే సదవకాశం ఈ ప్రభుత్వం కల్పిం చింది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ‘అమూల్‌’తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకం. తద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడమే కాకుండా మహిళలకు ఈ రంగంలో ఎంతో ఉపాధి లభించి చేదోడుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టిన తర్వాత మన రాష్ట్ర అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలను ఏడాది తిరక్కముందే అమలు చేసి చూపించారు. పిల్లల్ని బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందించారు. అమ్మఒడి పథకంతో 43 లక్షలమంది తల్లులకు లబ్ధి చేకూరింది. విద్యాదీవెన పథకంతో దాదాపు 12 లక్షలమంది తల్లులకు వారి పిల్లల చదువుకయ్యే (డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులు)కు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. 12 లక్షలమంది తల్లులకు వారి పిల్లల చదువులకు అయ్యే భోజన, వసతి ఖర్చులకు గాను ఏటా రూ. 20,000లు రెండు దఫాలుగా చెల్లిస్తున్నారు.

మహిళా రిజర్వేషన్‌ చట్టం ద్వారా రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మార్కెట్‌ యార్డు కమిటీలు, దేవాలయ కమిటీలు లాంటి నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహిళల భద్రత కోసం దిశచట్టం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల బతుకులు బాగుపడాలని మద్యపాన నియం త్రణ చట్టం అమలు చేస్తున్నారు.  రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది మహి ళలకు వారి పేరుమీదనే ఇళ్ల పట్టాలు అక్టోబర్‌లో ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 91 లక్షల మంది డ్వాక్రా మహి ళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రభుత్వం ‘వైఎస్సార్‌ పావలా వడ్డీ’ పథకం ద్వారా మొత్తం వడ్డీని భరించి రూ.1,400 కోట్లు చెల్లించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 ఏళ్లనుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆర్థికంగా వెనుకబడిన కాపు మహిళలకు ఏటా రూ.15,000 చొప్పున వెఎస్సార్‌ కాపు నేస్తంలో భాగంగా ఆర్థిక సహాయం చేస్తు న్నారు. బిడ్డను ప్రసవించిన ప్రతి తల్లికి ‘ఆరోగ్య ఆసరా’ పథకం ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు.

సంక్షేమ కార్య క్రమాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఒకే ఒక నాయకుడు వైఎస్‌ జగన్‌. మహిళా స్వావలంబన దిశగా అనేక సంక్షేమ కార్యక్రమా లను ఏడాది కాలం లోనే చేపట్టి, వాటిని విజయ వంతంగా అమలు చేస్తున్న మన సీఎం జగన్‌ను రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు తమ సొంత బిడ్డలా, సోదరుడిలా ఎంతో వాత్సల్యంతో చూసుకుంటు న్నారనడంలో అతిశయోక్తి లేదు. మహిళా సాధికా రత, సంక్షేమం, రక్షణ.. దిశగా దేశానికే ఆదర్శ ప్రాయుడయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ‘ఆమె’ను రాణిగా చేశారు. 

వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌
చల్లా రామకృష్ణారెడ్డి
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top