యంగ్‌ టాలెంట్‌

Young Talent in Singing - Sakshi

థాయ్‌లాండ్‌లో పుట్టిన వర్షిత పదమూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో ఇండియాకు వచ్చింది. సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చెన్నైలోని ‘కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీ’లో మ్యూజిక్‌ కోర్సు చేసింది. ‘స్వర్ణభూమి అకాడమీ ఆఫ్‌ మ్యూజిక్‌’ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత జాజ్‌ మ్యూజిక్‌పై ఆసక్తి మొదలైంది.

వర్షిత ఫస్ట్‌ సింగిల్‌ ‘స్టే’కు మంచి స్పందన వచ్చింది. స్పాటిఫై, యూట్యూబ్, సౌండ్‌క్లౌడ్‌లో ఆమె పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఇరవై సంవత్సరాల వయసులో సెవెన్‌ ఐలాండ్‌ ఫిల్మ్‌ఫెస్టివల్, కోవ్లాంగ్‌ పా యింట్‌ సర్ఫ్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లాంటి ఎన్నో ఫెస్టివల్స్‌లో తన గాత్రాన్ని వినిపించింది వర్షిత.

ఏఆర్‌రెహమాన్‌ మ్యూజిక్‌ ట్రూప్‌లో భాగంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 22 సంవత్సరాల వర్షిత పాటలు పడడంలోనే కాదు రాయడంలో కూడా ప్రతిభ చూపుతుంది.వర్షిత ΄పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో, మాటల్లో అంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో ఎన్నో కళాశాలల్లో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top