'చాయ్‌'ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? | Viral Video Of Tea Making Using Unconventional Method | Sakshi
Sakshi News home page

'చాయ్‌'ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?

Dec 10 2023 11:39 AM | Updated on Dec 10 2023 11:39 AM

Viral Video Of Tea Making Using Unconventional Method - Sakshi

రోజువారీ జీవితంలో ఒకటి లేదా రెండు సార్లు చాయ్‌ని ఆస్వాదించకుండా ఉండం. కొందరూ అంతకు మించి తాగేవాళ్లు ఉన్నారు. అందుకోసమే కాబోలు పని ప్రదేశాల్లో టీ బ్రేక్‌ అని వచ్చేసింది. కొద్దిగా అలా బయటకు వెళ్లి కొంచెం టీ తాగి రిలాక్స్‌ అయితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటి టీ మన ఇండియాలో చాలా విభిన్న పద్ధతుల్లో చేస్తారు. వాటి పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్ని రకాల చాయ్‌లు ఉన్నాయో తెలసిందే. అలాంటి చాయ్‌ని ఓ మహిళ చాలా వెరైటీగా తయారు చేసింది.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి అందులో టీ పోడి, కొంచెం షుగర్‌ వేసి కాసేపు వేయించింది. ఇంతలో షుగర్‌ కరిగి మిశ్రమం దగ్గరకు వస్తుందనంగా యాలకులు, అల్లం, కొంచెం నీళ్లు వేశారు. కాపేపటికి పాలు వేసి కాసేపు మరగించి సర్వ్‌ చేశారు. 'టీ' ఇలా కూడా చేయొచ్చా అన్నంత వెరైటీగా చేసిందామె. చూస్తే మాత్రం 'చాయ్‌' మంచి రంగులో, చిక్కదనంతో అందంగా కనిపించింది. ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు 'ఏం చేశార్‌ మేడమ్‌' అని కొందరూ ప్రశంసిస్తే. మరికొందరూ మాత్రం ఇలానే చేసేదీ అని ఫైర్‌ అయ్యారు. 

(చదవండి: ఫ్రూట్‌ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement