ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్‌..'భర్తకు ప్రేమతో'..

UK Womans Heartbreaking Post Before Dying Of Cancer  - Sakshi

ఓ మహిళ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన కేన్సర్‌తో భాధపడుతూ మరణం అంచుల వద్ద ఉంది. ఆ టైంలో ఆమె చివరి మాటలుగా రాసుకొచ్చిన పోస్ట్‌ ఎంత భావోద్వేగంగా ఉందంటే..చదువుతుంటే కంటతడి పెట్టకుండ ఉండలేం. కళ్ల ముందు మరణం చేరువలో ఉన్నా.. ఆమె తనలాంటి వాళ్లు ఎలా ఉండాలో వివరించింది. జీవిత సాఫల్యం అంటే ఏంటో వివరించింది. ప్రాణాలను పొట్టనబెట్టుకునే క్యాన్సర్‌ల విషయంలో అవగాహన పెంచుకుని చికిత్సలు తీసుకోవాలని కూడా చెప్పింది. ప్రాణం ఉండదు అనే టైంలో ఇంత బరువైన మాటలు రావాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా!. ఆ పోస్ట్‌లో ఆమె ఏం రాసిందంటే..

యూకేకి చెందిన డేనియోల్లా మరణించడానికి కొన్ని రోజుల ముందు భావోద్వేగానికి గురిచేసే పోస్టు పెట్టింది. ఆ పోస్టు ప్రతి ఒక్కరి మనుసును కదిలిస్తుంది. ఆ పోస్టులో..తాను నయంకానీ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఎలా వచ్చిందనేది కూడా తెలియదు. నా చేతుల్లో జీవితం లేదని తెలిసిపోయింది. తన పిత్త వాహికలో క్యాన్సర్‌ మొదలవ్వడంతో ఇదివరకటిలా హాయిగా జీవితం సాగలేదు. వచ్చే సంవత్సరాల్లో అయినా ఈ భయానక వ్యాధిపై పరిశోధనలు జరుగుతాయని ఆశిస్తున్నా. తద్వారా నాలాంటి చాలామందిని మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా కాపాడొచ్చు. మనం ఈ వ్యాధిని అదుపు చేయలేకపోయినా స్పందించే విధానంలో దమ్ముంటే ఏ వ్యాధి అయినా తోకముడవాల్సిందే.

జీవితాన్ని కోల్పోతున్నామని నిరాశ చెందకూడదు. బతికే ప్రతీ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించే సమయం అని గుర్తు పెట్టుకోవాలి. ఇక నీకు ప్రతి నిమిషం అమూల్యం అనే విషయం తెలుస్తుంది. చావు చివరి నిమిషంలో నీలో ఉన్న అచంచలమైన ధైర్యం, శక్తి తన్నుకుంటూ బయటకు రావాలి . ఆ చావే నిన్ను కబళిస్తున్నందుకు కంటతడి పెట్టేలా చావుదెబ్బ తీయాలి. తాను ఆ మార్గాన్నే ఎంచుకున్నానని చెప్పింది. అందుకోసం తానుబాధకు బదులుగా ప్రతీ క్షణం ఆస్వాదించేందుకు యత్నించా. రోమాంటిక్‌ ఉండేలా జీవితాన్ని మార్చుకున్నా. ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతికాను. సంతోషాన్నిచ్చే ప్రతి పని చేశా. చివరి వరకు ఆనందంగా ఉన్నా. అలాగే నాలా ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడే వాళ్లు మీ ఆనందాన్ని దూరం చేసుకునేలా ఆఖరి నిమిషాలు బాధగ అస్సలు గడపొద్దు.

ఇక తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ.." తాను ఆనందంగా జీవించానని, అలాగే మీరు కూడా మీ ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. మీకు ఇష్టమైనవి చేయండి. మనం విడిపోయినప్పటికీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఇప్పటి వరకు అన్ని విధాలుగానాకు మద్దుతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అన్ని విధాలు ఆనందంగా జీవించేందుకు అర్హులు. అందువల్ల హాయిగా జీవితాన్ని గడపండి అంటూ తన భాగస్వామికి దైర్యాన్ని నూరుపోస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది" డేనియోల్లా. దీంతో నెటిజన్లు "చాలా శక్తిమంతమైన పోస్ట్‌ ఇది, చివిరి నిమిషంలో కూడా స్పూర్తిని నింపేలా పోస్టు పెట్టారు ఎందరో క్యాన్సర్‌ రోగులకు ప్రేరణనిచ్చే పోస్టు ఇది. ఆమె మరణించినప్పటికీ ఈ పోస్ట్‌లోని అక్షరాల రూపంలో మన ముందే ఉంటుందామె". అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. 

(చదవండి: షమీకి మడమ సర్జరీ: అసలేంటీ సర్జరీ? రికవరీకి ఎందుకంత టైం?)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top