షమీకి మడమ సర్జరీ: అసలేంటీ సర్జరీ? రికవరీకి ఎందుకంత టైం?

what Is The Achilles Tendon Surgery Mohammad Shami Underwent  - Sakshi

టీమిండియ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కాలి మడమ గాయంకు విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగిందని ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాను మళ్లీ యథావిధిగా నడవడానికి కొంత సమయం పడుతుందని కూడా చెప్పాడు. గతేడాది జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లోనే షమీ ఈ గాయం బారిన పడ్డాడు. అసలేంటి మడమ గాయం?. రికవరీ అవ్వడానికి ఎందుకంత సమయం తీసుకుంటుంది?

మడమ గాయం అంటే..
కాలు దిగువ భాగాన ఉండే మడమ స్నాయువులో చీలికను ప్రభావితం చేసే గాయం. ఇది ప్రధానంగా  క్రీడా రంగంలోని వ్యక్తులకు ఎక్కువగా వస్తుంది. ఇది ఎక్కువగా సాకర్, బాస్కెట్‌బాల్ టెన్నిస్ క్రికెట్‌ వంటివి పరుగుతో కూడిన గేమ్‌లు కారణంగా జరుగుతుంది. అందువల్ల ఇలాంటివి ఆడేటప్పుడూ ఆటగాళ్లు ఎక్కువగా మడమ గాయాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆడేటప్పుడూ తెలియకుండానే మడమపై మొత్తం శరీరం బరువు పడటం, ఆడాలనే ఇంటెన్షన్‌లో సరిగా పాదాలపై ఆనకపోవడం తదితర కారణాల వల్ల ఈ మడమ గాయం బారినపడటం జరగుతుంది. 

ఇది అకిలెస్ స్నాయువు (మడమ బంధన కణజాలం) మడమ ఎముకతో అనుసంధానించ బడి బలమైన పీచుతాడులా ఉంటుంది. అందువల్ల ఈ మడమను మరింతగా వెనక్కి లాగితే లోపల స్నాయువు పాక్షికంగా లేదా పూర్తిగా చిరిగిపోతుంది. ఈ అకిలెస్‌ స్నాయువు చీలి పోవడంతో నడిచినప్పుడూ నొప్పితో కూడిన పాప్‌ అనే శబ్దం వస్తుంది. ఇది చీలమండల దిగువ కాలు లేదా వెనుక భాగంలో భరించలేని విధంగానొప్పి వస్తుంది. నడిచే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ చీలికను సరిచేసేందుకే ఒక్కోసారి సర్జరీలు చేయాల్సి ఉంటుంది. కొందరికి సర్జిరీ అవసరం లేకుండానే మందులతో నయం చేస్తారు. 

లక్షణాలు..

  • మడమ భాగంలో ఏదో తన్నుతున్నట్లు అనిపిస్తుంది. 
  • నొప్పి, మడమ వాపు
  • నడుస్తుంటే మడమను కిందకు వంచలేకపోవడం
  • నొప్పి ఉన్న కాలుపై అస్సలు నిలబడలేకపోవడం
  • గాయం వస్తే పాపింగ్‌ లేదా స్నాపింగ్‌ శబ్దం రావడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

కారణాలు..

  • పాదాన్ని నెట్టడానికి, కాలి వేళ్లపై బరువు ఆన్చడానకి ఉపయోగపడేది ఈ మడమ. నడిచేటప్పడూ, పాదాలను కదిలించిన ప్రతిసారి మనకు ఉపయోగపడేది ఈ మడమే. ఈ గాయం సాధారణంగా 21/2 అంగుళాలు(సుమారు ఆరు సెంటీమీటర్లు) దూరంలో స్నాయువు విభాగంలో సంభవిస్తుంది. ఇక్కడ రక్తప్రవాహం తక్కువుగా ఉండటం వల్ల తొందరగా చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇది నయం చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. 
  • ఈ అకిలెస్‌ స్నాయువు(మడమ కండరాల బంధనం)పై ఒత్తిడి అధికంగా పెరిగితే గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ
  • జంపింగ్‌తో కూడిన క్రీడలు ఆడే వాళ్లు ఈ అకిలెస్‌ స్నాయువుకి సంబంధించిన గాయాల బారిన పడతారు. 

శస్త్రచికిత్సలో ఏం చేస్తారంటే..
సర్జికల్ రిపేర్ అనేది సాధారణంగా ఔట్ పేషెంట్ విధానం. దీని తర్వాత వైద్యు పర్యవేక్షణలో నడవాల్సి ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే చీలమండల వెనుక భాగాన్ని ఓపెన్‌ చేస్తారు కొద్దిపాటి కోతలతో కనిష్ట ఇన్వాసివ్‌ లేదా పెర్కుటేనియస్‌ రిపేర్‌ చేస్తారు. ఆ తర్వాత స్నాయువు చ్టుటూ కణజాల కోసం తెరిచి దెబ్బతిన్న కణజాలాన్ని తీసేస్తారు. శరీరంలో మరోకచోటి నుంచి స్నాయువుని తీసి అకిలెస్‌ స్నాయువు భాగాన్ని భర్తీ చేసేలా  సేకరించిన స్నాయువుని పెట్టడం జరగుతుంది. ఆ తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. ఒక్కోసారి అదే రోజున ఇంటికి పంపించేస్తారు కూడా.  

అంత టైం ఎందుకంటే..
మడమ కండరాల బంధన కణజాలంలో జరిగే గాయం ఇది. కాబట్టి సర్జరీ తర్వాత పూర్తిగా నయం అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఈలోగా నయం అయ్యేలా కొద్దిపాటి వ్యాయామాలు చెయ్యొచ్చు ఆ తర్వాత  ఫిజికల్‌ థెరఫీ సాయంతో మడమ బలాన్ని పొందగలగొచ్చు. కనీసం మూడు నెలల సమయం పూర్తిగా రికవరీ అయ్యేలా విశ్రాంతి తీసుకుంటే గానీ ఇదివరకటి మాదిరిగా క్రీడల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఇది పాదాలు కదలడానికి, నేలపై ఆనడానికి అవసరమైన ప్రధాన భాగం కావున రికవరీ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. లేదంటే తగ్గడం అటుంచి నడవడం కష్టమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్లే పూర్తిగా రికవరీ అయ్యేందుకు మూడు నెలలు సమయం పడుతుందని క్లియర్‌గా పేషెంట్‌కు చెప్పేస్తారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో ఈ గాయం కారణంగా కెరిరీకి ముగింపు పలికీన క్రీడాకారులు కూడా ఉన్నారు. అందువల్ల ఈ సమస్య చిన్నగా తలెత్తిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top