
సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో ఉంచం. సాధారణంగా బయట అరమాల్లో రెండింటిని ఒకే చోట ఉంచుతాం. కొందరైతే నేరుగా ఉల్లిపాయ బుట్టలోనే ఉంచుతారు. అయితే ఇలా మాత్రం అస్సలు ఉంచకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతంకమని, ఒక్కోసారి ఇలా నిల్వచేసిన వాటినే గనుక వండి తింటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు సరైన ఆధారాలు స్పష్టం కానప్పటికీ ఇలా రెండింటిని కలిసి నిల్వ చేయద్దని మాత్రం సూచిస్తున్నారు. ఎందుకంటే..
ఇలా ఎప్పుడైతే రెండింటిని కలిపి నిల్వ చేస్తారో..అప్పుడు ఉల్లిలో విడుదలయ్యే ఎథెలిన్ బంగాళదుంపలతో చర్య జరిపి..త్వరగా మొలకెత్తేలా చేస్తుందట. అంతేగాదు అలాంటి బంగాళ దుంపల్లో సోలనిన్, చాకోనిన్ అనే విషాలు ఉత్పత్తి అవుతాయి. అవి గనుక తీసుకుంటే..అల్సర్లు, పేగువాపు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట. అంతేగాదు ఒక్కోసారి నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.
అధ్యయనంలో కూడా..
అమెరికా సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు ఇథలీన్‌ను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే వాటి సమీపంలో ఇతర ఆహార పదార్థాలను ఉంచుతామో.. అవి త్వరగా పాడవ్వడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. అదీగాక ఈ బంగాళ దుంపలు సహజంగా సోలనిన్, చాకోనిన్ వంటి ఆల్కాలయిడ్‌లను కలిగి ఉంటుంది.
ఎప్పుడైతే ఇలా ఉల్లిపాయల వద్ద వాటిని ఉంచగా..అవి త్వరగా మొలకెత్తి..పెద్ద మొత్తంలో విషపూరితమైన ఆల్కలాయిడ్లను విడుదల చేస్తుందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఈ పచ్చి లేదా చెడిపోయిన బంగాళ దుంపలు మానవులకు అత్యంత ప్రమాదమని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల మొలకెత్తని తాజా బంగాళ దుంపలే తినడం మంచిదని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఈ రెండిని కలిపి నిల్వ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: నేచురల్ బ్యూటీ కోసం ఐదు పువ్వులు..! ఆ సమస్యలు దూరం..)