పుట్టినపుడు పెన్సిల్‌ పరిమాణంలోనే! | Some New Facts About Pandas | Sakshi
Sakshi News home page

పుట్టినపుడు పెన్సిల్‌ పరిమాణంలోనే!

Jun 8 2026 7:53 AM | Updated on Jun 8 2026 7:53 AM

Some New Facts About Pandas

జైంట్‌ పాండాలను సాధారణంగా పాండాలు అని కూడా పిలుస్తారు. ఇవి అడవులలో, ముఖ్యంగా మధ్య చైనాలోని ఎత్తైన పర్వతాలలో ఉండే దట్టమైన వెదురు అడవులలో కనిపిస్తాయి.

  • పాండాలు అప్పుడప్పుడు చిన్న జంతువులను, చేపలను తిన్నప్పటికీ... ముఖ్యంగా వీటి ఆహారంలో 99 శాతం వెదురు మాత్రమే ఉంటుంది.

  • పాండాలు చాలా ఎక్కువగా తింటాయి. ఎంతగా అంటే ప్రతిరోజూ దాదాపు 12 గంటల ΄ాటు తమ పొట్టలను నింపుకుంటూ, సుమారు 12 కిలోల వెదురును తింటాయి!

  • పాండాలు 1.2 మీటర్ల నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి 75 కేజీల నుంచి 135 కేజీల బరువు ఉంటాయి.

  • పాండా పిల్లలు పుట్టినప్పుడు గులాబీ రంగులో ఉండి కేవలం 15 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు ఒక పెన్సిల్‌ పరిమాణంలో ఉంటాయి! ఇవి పుట్టినప్పుడు గుడ్డిగా ఉంటాయి, పుట్టిన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కళ్ళు తెరుస్తాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement