లేత గులాబీ చీరలో కుందనపు బొమ్మలా సచిన్‌ కూతురు! | Sara Tendulkars Pink Georgette Saree With Backless Blouse Cost Rs 37K | Sakshi
Sakshi News home page

లేత గులాబీ చీరలో కుందనపు బొమ్మలా సచిన్‌ కూతురు!

Feb 19 2024 2:50 PM | Updated on Feb 19 2024 3:24 PM

Sara Tendulkars Pink Georgette Saree With Backless Blouse Cost Rs 37K - Sakshi

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ముద్దల తనయ సారా టెండుల్కర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటి కప్పుడూ తన లేటెస్ట్‌ స్టన్నింగ్‌ లుక్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. అలానే ఈసారి చీర కట్టులో ముగ్ద మనోహరంగా ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. అందులో చమీ అండ్‌ పాలక్‌ శారీస్‌ బ్రాండ్‌కి చెందిన పింక్‌ జార్జెట్‌ చీరలో తళుక్కుమంది. ఈ చీరకు తగ్గట్టు ఎంబ్రాయిడరీ నెక్‌ బ్లౌజ్‌తో చాలా అద్భుతంగా కనిపించింది.

ఆ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా చెవిపోగులు, పాపిడి బోట్టు, మ్యాచింగ్‌ గాజులతో కుందనపు బొమ్మలా ఉంది. చక్కగా తెలుగింటి వారి ఆడపడుచులా జడ వేసుకుని కనిపించింది. ఆ లేత గులాబి చీరలో ఉన్న మరో అందమైన గులాబీ ఏమో అనేంత అందంగా ఉంది. ఇక సారా ధరించి ఈ లేత గులాబీ జార్జెట్‌ చీర ధర రూ. 37,000/-. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సారా మీరు అద్భుతంగా ఉన్నారని ఒకరూ, కళ్లు చెదిరే అందం మీ సొంతం అని మరోకరూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్‌ చుడిదార్‌లో లుక్‌ మాములుగా లేదుగా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement