మానసిక ఆరోగ్యంపై టెక్‌ నిపుణుడు మోహన్‌దాస్‌ పాయ్‌ సలహాలు! | Mohandas Pai: Everyone To Learn About Life And Mental Health | Sakshi
Sakshi News home page

ఉన్నది ఒక్కటే లైఫ్‌..ప్లీజ్‌ క్లిష్టంగా మార్చుకోకండి..! టెక్‌ గురు మోహనదాస్‌ జీవన సూత్రాలివే

Oct 14 2026 12:32 PM | Updated on Oct 14 2026 12:32 PM

Mohandas Pai: Everyone To Learn About Life And Mental Health

అందరు ఆరోగ్యంగా ఉండటం గురించి మాట్లాడతాం. ఆరోగ్యం కూడా బాగుండాలంటే..ముందుగా మనసు ఆహ్లాదభరితంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ఆ విషయాన్నే ఆరిన్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ మోహన్‌దాస్‌ ఇటీవల ఒక మీడియాతో అన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం అది ఆరోగ్యప్రదంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానం అని అన్నారు. అయితే ఎవ్వరూ దీన్ని సరిగా అర్థం చేసుకోరు అంటూ చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.

ఆరిన్‌ క్యాపిటల్‌ చైర్మన్‌, టెక్‌ నిపుణుడు మోహన్‌దాస్‌ పాయ్‌ ఇటీవల ఒక మీడియాతో మాట్లాడతూ..మానసిక ఆరోగ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మానసిక ఆరోగ్యం అనేది ఎప్పుడూ సరిగా అర్థం చేసుకోని అంశం. జీవితాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా దృఢంగా ఉండటమే మానసిక ఆరోగ్యం. మనం బలహీనంగా ఉన్నామని లేదా కుంగుబాటుకు గురయ్యామని గుర్తించం అని అన్నారు. 

మానసిక ఆరోగ్య సమస్య అనేది పుట్టుకతో వచ్చేది కాదని అన్నారు. మనమందరం సాధారణ జీవితాలు గడుపుతాం. అయితే వాటిని మెరుగ్గా చేయమని సూచించారు. మనకు మనమే స్వీయ ప్రేరణ పొందుతూ మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండండని పిలుపునిచ్చారు. తాను రోజులో చివరి వరకు ఉత్సాహంగా పనులు చేయాలని కోరుకుంటానని అన్నారు. అలాగే ఆధునిక కార్పొరేట్‌ జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడంపై సలహా ఇస్తూ ..ఇలా అన్నారు. మీ జీవితాన్ని మీరు గడపండి. ఆశావాదంతో ఉండండి. మీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు కష్టపడండి. అంతే అంతకు మించి ఏమిలేదని అన్నారు. 

జీవితం చాలా సరళమైనది, ఉన్నది ఒక్కటే లైఫ్‌ అని మర్చిపోకండి మిత్రమా అని అన్నారు. అలాగే ప్రకృతిని గమనించండి. ముఖ్యంగా స్యూర్యుడు తన విధిన ఎంత నిబద్ధతతో నిర్వర్తిస్తాడో అలా మీ లైఫ్‌లో పనులన్నింటిని ఉత్సాహంగా చేసేలా ప్రయత్నించాలి. ముఖ్యంగా ది బెస్ట్‌గా చేయాలని అన్నారు. సూర్యుడు ఉదయించడంలోనూ అస్తమించడంలోనూ ఏమరపాటు గానీ తేడాలు గానీ ఉండవని గుర్తించుకోండని అననారు. 

అలాగే శారీరక దృఢత్వం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బరువు పెరగకుండా చూసుకోవాలని అన్నారు. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, బరువులు ఎత్తాలి, నడవాలి, శారీరకంగా చురుకుగా ఉండాలి అని చెప్పారు. తాను కరోనా మహమ్మారి సమయంలో పాటించిన దినచర్యను గుర్తు చేసుకుంటూ..ఒక ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేశానని చెప్పారు. 

ఇది తనకు అద్భుతమైన అనుభవం అని, ఎందుకంటే అసలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడపడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం మీ శరీరాన్ని, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం మన గురించి మనమే పట్టించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి..లేదంటే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. అంటూ తన సంభాషణను ముగించారు టెక్‌ నిపుణుడు మోహన్‌దాస్‌ పాయ్‌.

ఇదీ చదవండి: క‘లిపి’ నేర్చుకుందాం..! ఆడుతూ..ఇతిహాసాలు వినేద్దాం ఇలా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement