
ఉద్యమ నేపథ్యమే వారి స్నేహానికి విత్తనమయింది. వృక్షం అయింది. స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు తోటి ఉద్యమకారులు మలాలా యూసఫ్‌జాయ్, వెనెస్సా నకేట్‌లతో మంచి స్నేహం ఉంది. ఉద్యమకారులైనంత మాత్రాన గంభీరంగా ఉండాలని ఏమీ లేదు.
ఈ ముగ్గురు మరికొందరు యాక్టివిస్ట్‌లు చాలా సరదాగా ఉంటారు. బాల్యజ్ఞాపకాల నుంచి సోషల్ మీడియా సరదాల వరకు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటారు. ‘చైతన్యం మూర్తీభవించిన స్నేహితురాలు’ అని ఉగాండ పర్యావరణ ఉద్యమకారిణి వెనెస్సా నకేట్ గురించి గొప్పగా చెబుతుంది గ్రేటా థన్‌బర్గ్.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని లేడీ మార్గరెట్ హాల్‌లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లిన గ్రేటా థన్‌బర్గ్‌కు తన నేస్తం మలాలాతో కలిసి బోలెడు ముచ్చట్లు చెప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘షీ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్...’ అనే కాప్షన్‌తో గ్రేటాతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మలాలా.