జూన్ 15న ప్రపంచ పవన దినం
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది. విద్యుదుత్పాదన కోసం ఉపయోగించే పెట్రో ఇంధనాలు, బొగ్గు వంటి ఇంధనాలు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల వాడకం పెరుగుదల; రకరకాల అవసరాల కోసం అడవుల నరికివేత సహా అనేక కారణాలు భూతాపాన్ని అంతకంతకు పెంచుతున్నాయి.
భూతాపాన్ని అరికట్టడానికి పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచం ఈ శతాబ్ది ప్రారంభం నుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది. పునర్వినియోగ ఇంధనాలలో పవన శక్తి కూడా గణనీయమైన పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాలు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో పవన శక్తి కీలకమైనది. పవన శక్తి ఉత్పాదన సామర్థ్యంలో మన భారతదేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పవన శక్తి ఉత్పాదన వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం...
కొన్ని దేశాలు తమ మొత్తం విద్యుత్ అవసరాలను గణనీయంగా పవన విద్యుత్తు ద్వారానే తీర్చుకుంటున్నాయి. అలాంటి దేశాల వివరాలు గణాంకాల్లో...
దేశాల వారీగా మొత్తం విద్యుత్తులో పవనశక్తి వాటా


