కాపాడే టీ–షర్ట్‌లు

French company Floatee develops anti-drowning T-shirts  - Sakshi

ఫ్రెంచ్‌ కంపెనీ ‘ఫ్లోటీ’ పద్దెనిమిది నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం యాంటీ–డ్రౌనింగ్‌ టీ–షర్ట్‌లను రూపొందించింది. పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో పడితే మునిగిపోకుండా  ఈ టీ–షర్ట్‌లు కాపాడుతాయి. టీ–షర్ట్‌లో అమర్చిన విజిల్‌ పెద్దగా సౌండ్‌ చేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది.

స్టైలీష్‌గా, సౌకర్యవంతంగా ఉండే ఈ టీ–షర్ట్‌ ఎలా పనిచేస్తుంది...అనేదానిపై రూపొందించిన డెమో వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇది నోబెల్‌ బహుమతి పొందిన ఆవిష్కరణ కంటే గొప్పది. ఒక తాతగా పిల్లల భద్రత అనేది నాకు అత్యంత ముఖ్యమైనది’ అని ట్విట్‌ చేశాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top