రికార్డ్‌ స్థాయిలో బిలియనీర్ల సంపద: టాప్‌ మహిళ ఎవరో తెలుసా?  | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ స్థాయిలో బిలియనీర్ల సంపద: టాప్‌ మహిళ ఎవరో తెలుసా? 

Published Thu, Apr 4 2024 4:15 PM

Forbes World Billionaire 2024 Savitri Jindal India richest woman - Sakshi

'ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్' 2024లో 17మంది మహిళలకు చోటు

టాప్‌లో సావిత్రి  జిందాల్‌ 

రేణుకా జగ్తియాని జాబితాలోకి తొలిసారి

భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లోదూసుకుపోవడమే  కాదు. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు.  తాజాగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్' 2024లో 17మంది మహిళలు చోటు  సాధించారు.

ఈ ఏడాది భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2023లో 169 మంది ఉండగా తాజాగా  200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 25 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరి సంపద రికార్డు స్థాయిలో 41 శాతం పుంజుకుని  954 బిలియన్లకు  డాలర్లకు పెరిగింది. 

టాప్‌ -10 మహిళా బిలియనీర్లు

సావిత్రి జిందాల్: భాభారతీయ సంపన్న మహిళ జాబితాలో  జిందాల్ కుటుంబానికి చెందిన జిందాల్ గ్రూప్‌ చైర్‌పర్సన్. సావిత్రి జిందాల్ 35.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. 

రేఖా ఝున్‌ఝన్‌వాలా: ఇండియన్‌ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా  సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. రెండో స్థానంలో నిలిచారు. ఆమె నికర విలువ  8.5 బిలియన్‌ డాలర్లు   

వినోద్ రాయ్ గుప్తా: హావెల్స్ ఇండియాకు  చెందిన వినోద్ రాయ్ గుప్తా  5 బిలియన్‌ డాలర్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.

రేణుకా జగ్తియాని: ల్యాండ్‌మార్క్ గ్రూప్ చైర్‌పర్సన్,  సీఈవో రేణుకా జగ్తియాని 4.8 బిలియన్ల డాలర్లతో ఈ జాబితాలోకి అరంగేట్రం చేశారు. 2023,మే లో  మిక్కీ జగ్తియాని  కన్నుమూయడంతో, ఆమె కంపెనీ బాధ్యతలను చేపట్టారు.
స్మితా కృష్ణ-గోద్రెజ్:  గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ మహిళల బిలియనీర్ల జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. ఈమె  నికర విలువ 3.8 బిలియన్‌ డాలర్లు. గోద్రెజ్ కుటుంబ ఆస్తులలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు.

ఇతర మహిళా బిలియనీర్లు - నికర విలువ
రాధా వెంబు (3.4  బిలియన్‌ డాలర్లు) , అను అగా (3.3 బిలియన్‌ డాలర్లు), లీనా తివారి (3.2 బిలియన్‌ డాలర్లు), ఫల్గుణి నాయర్ (2.9బిలియన్‌ డాలర్లు), కిరణ్ మజుందార్-షా (2.7 బిలియన్‌ డాలర్లు), మృదులా పరేఖ్ (2.1 బిలియన్‌ డాలర్లు), సరోజ్ రాణి గుప్తా (1.6 బిలియన్‌ డాలర్లు), రేణు ముంజాల్ (1.6 బిలియన్‌ డాలర్లు, సారా జార్జ్ ముత్తూట్ (1.3 బిలియన్‌ డాలర్లు), అల్పనా డాంగి (1.2 బిలియన్‌ డాలర్లు), సుబ్బమ్మ జాస్తి (1.1 బిలియన్‌ డాలర్లు), కల్పనా పరేఖ్ (1.1 బిలియన్‌ డాలర్లు)

Advertisement
Advertisement