నవరాత్రి పూజ సమయంలో ధరించాల్సిన రంగులు

Dussehra Celebrations 2020 Navaratri Utsavalu Nine Colours - Sakshi

దసరా ప్రత్యేక కథనం

(వెబ్‌ స్పెషల్‌): తెలుగు లోగిళ్లలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని 9రూపాలలో కొలుస్తారు. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలు అలానే 9 రోజులకు నవ వర్ణాలు ప్రత్యేకం. మరి ఆ రంగలు.. వాటి ప్రత్యేకత ఏంటో చూడండి..

మొదటి రోజు.. పసుపుపచ్చ రంగు
శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా కొలుస్తారు. శివుడి భార్యగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం.. ఎడమ చేతిలో తామర పువ్వుతో నంది మీద దర్శనమిస్తారు. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

రెండవ రోజు.. ఆకుపచ్చ రంగు
రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తాం. ఈ రూపం విముక్తి, మొక్షం, శాంతి, శ్రేయస్సుకు ప్రతీక. చేతిలో జపమాల, కమండలం.. ఉత్త కాళ్లతో దర్శనమిచ్చే అమ్మవారు ఆనందం, ప్రశాంతతను ఇస్తుంది. నేడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: కోవిడ్‌ నియమాలతో దసరా ఉత్సవాలు..)

మూడవ రోజు.. బూడిద రంగు
శివుడిని వివాహం చేసుకున్న తరువాత, పార్వతి తన నుదిటిన అర్ధచంద్రాన్ని అలంకరించింది. ఆమె అందం, ధైర్యానికి ప్రతీక. నేడు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు. 

నాల్గవ రోజు.. నారింజ రంగు
నాల్గవ రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో కొలుస్తారు. ఇది విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీక. కూష్మాండం భూమిపై ఉన్న వృక్ష సంపదతో సంబంధం కలిగి ఉంటుంది. నేడు నారింజ వర్ణం దుస్తులు ధరిస్తే మంచింది. (చదవండి: పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం)

ఐదవరోజు.. తెలుపు రంగు
స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. బిడ్డకు ఆపద వాటిల్లితే ఆ తల్లి శక్తిగా ఎలా పరివర్తన చెందుతుందో తెలుపుతుంది. ఈ రోజు ధవళ వర్ణం దుస్తులు ధరిస్తే మేలు.

ఆరవ రోజు.. ఎరుపు రంగు
ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయనిగా కొలుస్తారు. యోధురాలికి ప్రతీక. కనుక ఆరవ రోజు ఎరుపు వర్ణం దుస్తులు ధరిస్తారు. 

ఏడవ రోజు.. నీలం రంగు
అమ్మవారిని అత్యంత భయంకరమైన రూపమైన కాళరాత్రిగా పూజిస్తారు. ఆ రోజు అమ్మవారు సుంభ, నిసుంభ రాక్షసులను చంపడానికి తన అందమైన చర్మాన్ని విడిచిపెట్టిందని ప్రతీక. అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుందని నమ్మకం. ఏడవ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: శుభ గడియలు షురూ)

ఎనిమిదవ రోజు.. గులాబి రంగు
మహాగౌరి తెలివితేటలు మరియు శాంతికి ప్రతీక. ఈ రోజు గులాబి రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇది ఆశావాదాన్ని సూచిస్తుంది.

తొమ్మిదవ రోజు.. ఊదా రంగు
చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందుకుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top