కోవిడ్‌ నియమాలతో దసరా ఉత్సవాలు..

Devi Navarathri Celebrations In Kanaka Durga Temple With Covid Rules - Sakshi

సాక్షి, విజయవాడ : కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విజయవాడ కనకదుర్గ గుడిలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం రోజు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈసారి దసరా ఉత్సవాలకు రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికే దర్శన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దుర్గగుడిలో దసరా నవరాత్రులు ఆహ్వాన పత్రికను దుర్గగుడి పాలకమండలి సభ్యులు, తదితరులు ఆవిష్కరించారు. చదవండి: ‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top