వండర్‌ఫుల్‌ టిప్స్‌ : బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప...ఓసారి ట్రై చేయండి..!

Check these wonderfull kitchen tips and tricks - Sakshi

మన బామ్మల దగ్గర్నించి, ఇప్పటిదాకా వంటిట్లో గానీ,  వంటల్లో గానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు కానీ చక్కటి ఇంటి చిట్కాలను, హోం రెమిడీస్‌ను ఫాలో అవుతూ ఉంటాం.  నిజానికి  ఇవి చాలా బాగా పనిచేస్తాయి  కూడా. మరి అలాంటి  టిప్స్‌  అండ్‌  ట్రిక్స్‌ కొన్ని మీ కోసం..

కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు.
⇒ అగరబత్తిసుసితో ఇత్తడి పాత్రలు కడగడితే  భలే శుభ్రపడతాయి.
⇒ కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
⇒ మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి.
⇒ బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలుంచితే త్వరగా పాడవ్వదు. 
⇒ నిమ్మ చెక్క మీద ఉప్పు, మిరియాల పొడి చల్లి స్టౌ మీద ఉంచి, కొద్దిగా వేడి చేసి, ఆ రసాన్ని పిండుకొని తాగితే మైగ్రేన్‌ నుంచి ఉపశమనం దొరుకుతుంది
⇒ నిమ్మ రసం, తేనె, గ్లిజరిన్‌లను సమపాళ్ళలో కలపాలి. రోజుకు మూడుసార్లు  ఒక టీ స్పూను చొప్పున తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది
⇒ ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి తాగితే ఉపశమనం. 
⇒ పిల్లలకు జలుబు చేసినపుడు, తులసి, అల్లం, నాలుగు వామ్ము ఆకులు వేసి మరిగించిన నీళ్లను తాగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
⇒ ముక్కు బాగా దిబ్బడ వేసినపుడు, పిల్లల్ని వెల్లకిలాకాకుండా, ఒక పక్కకు పడుకోబెట్టి, వీపు మీద బేబీ విక్స్‌ రాసి మెల్లిగా  రుద్దితే  తొందరగా నిద్ర పోతారు.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top