బయట ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మంటున్నాడు. అత్యవసరం ఉంటేనేగానీ బయటకు రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు మాత్రం ఏసీలతో పనిలేకుండా ఇళ్లను కూల్‌గా మార్చే పద్ధతి అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఈ పద్ధతిని దాదాపు నాలుగు వేలకు పైగా కుటుంబాలు అనుసరిస్తూ..విద్యుత్‌ను ఆదా చేస్తూ, పర్యావరణహితంగా జీవనం సాగిస్తుండటం విశేషం. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా సైతం ఆ టెక్నిక్‌కు ఫిదా అవ్వతూ ఆ విషయాన్ని సోష్‌ల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
జైపూర్‌లో వేసవి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ మాములుగానే వేసవిలో ఉష్ణోగ్రతలు 40°C దాటే ఉంటుంది. ఫలితంగా ఇంటి పైకప్పులు అధిక వేడిని గ్రహించి ఇళ్లు భరించలేనంత వేడిగా ఉంటాయి. ఎయిర్ కండిషనర్ లేనిదే ఉండలేం అన్నంత దారుణంగా ఉంటుందక్కడ పరిస్థితి. జైపూర్‌కి చెందిన ఒక స్థార్టప్ ఆ సమస్యకు రూఫ్‌టాప్ ఫార్మింగ్ సిస్టమ్స్‌తో చక్కటి పరిష్కారం అందించింది.
ప్రస్తుతం జైపూర్‌లో అంతకంతకు పెరుగుతున్న ఈ రూఫ్‌టాప్ ఫార్మింగ్ ఉద్యమాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇది తమ ఇళ్లను చల్లగా ఉంచుకుంటూనే సొంత ఆహారాన్ని పండించుకోవాడానికి సహాయపడుతుంది. నివాసితులు సాధారణ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుంటూనే తమ రూఫ్‌టాఫ్‌లను పచ్చని ప్రదేశాలుగా మార్చడం ద్వారా రోజురోజుకు తీవ్రమవుతున్న వేసవికాలానికి ఎలా అలవాటు పడుతున్నారో మహీంద్రా వివరించారు.
రాబోయే సంవత్సరాలలో ఎండలు అంతకంతకు అధికమవుతాయన్నది జగమెరిగిన సత్యం. అలాంటి వాతవరణ పరిస్థితులకు ఈ ఆలోచన విధానమే సరైన మార్గదర్శకం అని పోస్టులో పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు ఆ స్టార్టప్ కంపెనీ ఈ పద్ధతిని సులభంగా ఇన్‌స్టాల్ చేసేలా పోర్టబుల్ రూఫ్‌టాప్ గార్డెనింగ్ సెటప్‌లను అందిస్తుంది. అలాగే లీక్-ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్ డ్రేనేజీ వంటివి ఉంటాయి. పెద్ద నిర్మాణ మార్పులు అవసరం లేకుండా సులభంగా మొక్కలను పెంచుకునే వీలు కల్పిస్తోంది.
ఫలితంగా పైకప్పులపై ఉన్న అధికవేడిని తగ్గించడంలో ఈ పచ్చదనం సహాయపడుతుంది. తద్వారా గదులు సులభంగా ఏసీలు అవసరం లేకుండానే చల్లగా ఉంటాయి. ఈ విధానాన్ని అక్కడ చాలా కుటుంబాలు అనుసరించడం విశేషం. పైగా ఈ విధానం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం తోపాటు అధిక ప్రయోజనాలు పొందగలం అని చెబుతున్నారు సదరు స్టార్టప్ వ్యవస్థాపకులు. కాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఈ విధానం పర్యావరణ ప్రయోజనాల తోపాటు రోజువారి పొదుపుని కూడా అందిస్తుందని అటున్నారు నెటిజన్లు.
We still don’t know enough about the full consequences of climate change.
But we do know this: intense heat waves in India are no longer exceptions. They’re becoming a way of life.
These homeowners have responded by changing THEIR way of life.
By changing the way they live,… pic.twitter.com/9pr5yIktJv— anand mahindra (@anandmahindra) May 22, 2026
(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు)


